Header Banner

భారతీయ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. వీసాల రద్దుకు బ్రేక్‌! మరి వారి పరిస్థితి ఏమిటి?

  Sat Apr 26, 2025 15:55        U S A

అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల రద్దు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి వ్యతిరేకంగా యూనివర్సిటీల్లో నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలు, ఇతర చట్ట ఉల్లంఘనల కారణంగా పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జోసెఫ్ ఎఫ్. కారిల్లీ జూనియర్ ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీ కోర్టుకు తెలియజేశారు. ఇమ్మిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వీసాల సమీక్ష, రద్దుల కోసం ఒక కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని, అది పూర్తయ్యే వరకు విద్యార్థుల సెవిస్ (స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) స్టేటస్‌ను మార్చబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రద్దు చేసిన వారి స్టేటస్‌ను కూడా తిరిగి యాక్టివేట్ చేయనున్నట్లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: చైనాకు గుడ్‌బై చెప్పే దిశగా ఆపిల్‌.. భారత్‌ తయారీ కేంద్రంగా! మేడ్ ఇన్ ఇండియా' ముద్ర..!

 

ఇటీవల రద్దు చేసిన వీసాల్లో దాదాపు 1,500 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని, వీరిలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉందని వార్తలు వచ్చాయి. ఒక అమెరికన్ లాయర్ల సంఘం లెక్కల ప్రకారం, వారు సమీక్షించిన 300 రద్దు కేసుల్లో 50 శాతం భారతీయులవేనని తెలిసింది. అయితే, అధికారిక గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. వీసాలు రద్దు చేయబడిన విద్యార్థులు, వారి తరఫు న్యాయవాదులు పెద్ద ఎత్తున కోర్టులలో దావాలు వేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే వీసా రద్దు కావడంతో స్వదేశాలకు తిరిగి వెళ్లిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence